పంటలకు మెరుగైన మద్దతు ధర ప్రకటించాలి
ABN , Publish Date - Nov 18 , 2026 | 05:10 AM
పంటలకు మెరుగైన మద్దతు ధర నిర్ణయించి రైతుల్లో భరోసా కల్పించాలని, ఇందుకు చట్టం తీసుకురావాలని ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జుకృష్ణన్ డిమాండ్ చేశారు.
ఉత్పత్తి వ్యయంపై 50శాతం అదనంగా నిర్ణయించాలి..
ఇందుకోసం డిసెంబరు 1 నుంచి 3వరకు ఢిల్లీలో ఉద్యమం
ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జుకృష్ణన్
కార్మికుల సమస్యలపై ఉద్యమాలు.. గోదాముల ముట్టడి
వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు విజయ్ రాఘవన్
నల్లగొండ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): పంటలకు మెరుగైన మద్దతు ధర నిర్ణయించి రైతుల్లో భరోసా కల్పించాలని, ఇందుకు చట్టం తీసుకురావాలని ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జుకృష్ణన్ డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభల సందర్భంగా మంగళవారం పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు.. ఉత్పత్తి వ్యయంపై 50శాతం అదనంగా ఽపంటలకు మద్దతు ధరను నిర్ణయించాలని కోరారు.
ఐరోపా, న్యూజిలాండ్, బ్రిటన్ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు దేశ రైతాంగానికి నష్టం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా డిసెంబరు 1 నుంచి 3వ తేదీ వరకు ఢిల్లీలో సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగే భారీ కార్మిక పోరాటంలో రైతులు వ్యవసాయ కార్మికులు పాల్గొనాలని మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. కనీస మద్దతు ధర, ఉపాధి హామీ, ఆహార భద్రత కార్మిక హక్కుల పరిరక్షణ డిమాండ్లతో పోరాటం చేయనున్నట్టు చెప్పారు. విలేకరుల సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతినేని సుదర్శన్, తీగల సాగర్ తదితరులు పాల్గొన్నారు.
బెంగళూరులో వ్యవసాయ కార్మిక సంఘం మహా సభలు
దేశంలో వ్యవసాయ కార్మికుల సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని.. డిసెంబరు, జనవరిలో గోదాములను ముట్టడిస్తామని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత అధ్యక్షుడు, మాజీ ఎంపీ విజయ్ రాఘవన్ ప్రకటించారు. నిత్యావసర ధరలు పెరగడం, ఉపాధి హామీ పథకం అమలు తీరు, భూ పంపిణీ, ప్రజా పంపిణీ వ్యవస్థలో కోతలు, కార్మికుల హక్కులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభలను బెంగళూరులో ఫిబ్రవరి 14 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై
రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. మా సర్కారుపై సాక్షిది అసత్య ప్రచారమే.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం
Read Latest AP News And Telangana News