ఎంపీ సీఎం రమేశ్ ఇంట్లో రూ.18 లక్షల నగదు అపహరణ
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:20 AM
ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన హైదరాబాద్‌లోని నివాసంలో రూ. 18 లక్షల నగదు అపహరణకు గురైంది.
ఎంపీ కార్యదర్శి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు
ఇంట్లో సహాయకుడిగా పనిచేస్తున్న వ్యక్తిపై అనుమానం
బంజారాహిల్స్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన హైదరాబాద్‌లోని నివాసంలో రూ. 18 లక్షల నగదు అపహరణకు గురైంది. ఈ మేరకు ఎంపీ కార్యదర్శి ఎం. అనిల్ శనివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 65లోని ఎంపీ సీఎం రమేశ్ నివాసంలో దేశ్‌ముఖ్ ప్రవీణ్‌కుమార్ సహాయకుడిగా పనిచేస్తున్నాడు.
ఇంట్లోని నగదు లావాదేవీలు, చెల్లింపులు, సిబ్బంది జీతాల పంపిణీ వంటి బాధ్యతలను అతడికి అప్పగించారు. అయితే రెండు రోజులుగా ప్రవీణ్‌కుమార్ విధులకు రాకుండా, మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని పరారయ్యాడు. అనుమానం వచ్చి పరిశీలించగా ఇంట్లో ఉండాల్సిన రూ.18 లక్షల నగదు మాయమైనట్లు గుర్తించారు. అతని నివాసం వద్ద ఆరా తీసినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి
Read Latest Telangana News And Telugu News