పైలెట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలనం
ABN , Publish Date - Apr 15 , 2026 | 12:59 PM
మొయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా, ఈ కేసులో కేదార్ అనే వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, ఏప్రిల్ 15: మొయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా, ఈ కేసులో కేదార్ అనే వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత ఏడాది దుబాయ్‌లో డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా మరణించిన కేదార్‌తో పైలట్ రోహిత్ రెడ్డి సోదరులకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, కేదార్‌కు మధ్య భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ముఖ్యంగా రోహిత్, రితేష్ బ్యాంక్ ఖాతా నుంచి కేదార్‌కు రూ.25 లక్షలు బదిలీ అయినట్లు పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. ఈ ఆర్థిక లావాదేవీల గురించి రోహిత్ రెడ్డి, రితేష్‌ని ప్రశ్నించగా ఇద్దరూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని, వారు విచారణకు సహకరించడం లేదని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు. మరిన్ని విషయాలు రాబట్టడానికి కస్టడీని పొడిగించాల్సిన అవసరం ఉందని పోలీసులు తమ నివేదికలో స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
డీలిమిటేషన్‌తో అన్యాయం చేస్తే పెను ఉద్యమం తప్పదు: కేటీఆర్
Read Latest AP News And Telugu News