రాహుల్‌ని ప్రధాని చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్
ABN , Publish Date - Mar 02 , 2026 | 05:26 PM
ప్రజా జీవితంలో తానెప్పుడూ పైరవీలు చేయలేదన్నారు. గతంలో ప్రజాసమస్యలపై గళం విప్పిన తనపై కేసులు నమోదు చేశారని గుర్తు చేసుకున్నారు.
వికారాబాద్, మార్చి 02: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశం కోసం రాహుల్ ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షించారు. వికారాబాద్ వేదికగా తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా ముగింపు సమావేశం సోమవారం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతోపాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో తానెప్పుడూ పైరవీలు చేయలేదన్నారు. గతంలో ప్రజాసమస్యలపై గళం విప్పిన తనపై కేసులు నమోదు చేశారని గుర్తు చేసుకున్నారు.
ఆదివారం సైతం తాను కోర్టుకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ఈ 19 ఏళ్లలో జడ్పీటీసీ నుంచి తాను సీఎం అయ్యానని గుర్తు చేసుకున్నారు. ఆ క్రమంలో పార్టీ పదవులు సైతం నిర్వహించానని చెప్పారు. ఎమ్మెల్యేగా తాను మంచి అనుభవం పొందానన్నారు.
తనపై అనేక కేసులు పెట్టారని.. పరువు నష్టం దావాలు కూడా వేశారని పేర్కొన్నారు. దేశం కోసం, తమ కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పేర్కొన్నారు. సోనియా గాంధీ పేరుతోనే తెలంగాణలో అధికారంలోకి వచ్చామని వివరించారు. ఐదేళ్లు చేసిన పోరాటాల వల్ల రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారని వివరించారు. దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు. దేశంలో అనేక సమస్యలపై రాహుల్ గాంధీ పోరాటం చేశారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రగ్రహణం.. హోలీ పండగ ఎప్పుడు..?
గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొస్తాం: మంత్రి కొండపల్లి
For More TG News And Telugu News