సీఎం సభ నుంచి వెళ్తూ మహిళ మృతి
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:10 AM
సిద్దిపేటలో గురువారం సీఎం రేవంత్ సభకు వెళ్లిన హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన కొమ్ము సారవ్వ(54) ప్రమాదవశాత్తు చనిపోయింది.
బస్సుల మధ్య నలిగిపోయిన సారవ్వ
మృతురాలు స్వస్థలం హుస్నాబాద్‌లోని నాగారం
ప్రభుత్వం తరఫున రూ.5లక్షల చెక్కును ఆమె కుటుంబానికి అందించిన మంత్రి పొన్నం
హుస్నాబాద్ రూరల్/సిద్దిపేట క్రైం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేటలో గురువారం సీఎం రేవంత్ సభకు వెళ్లిన హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన కొమ్ము సారవ్వ(54) ప్రమాదవశాత్తు చనిపోయింది. సభ ముగిసిన తర్వాత స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సు ఎక్కడం కోసం ఆమె రెండు బస్సుల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళుతుండగా, ముందు బస్సు డ్రైవర్ బస్సును కొద్దిగా వెనుకకు తీయడంతో 2 బస్సుల మధ్యలో నలిగిపోయింది.
దీంతో సారవ్వకు తీవ్రగాయాలయ్యాయి. పావని మహిళా గ్రూపు సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది. తెలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమె కుటుంబానికి తక్షణ సాయంగా రూ.5లక్షల చెక్కును అందజేశారు. మహిళా సంఘాల సభ్యులకు వర్తించే రూ.10 లక్షల బీమా సారవ్వ కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు
తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..