తెలంగాణను ఇబ్బంది పెట్టాలన్నదే కేంద్రం ఆలోచన: పొన్నం ప్రభాకర్
ABN , Publish Date - Jun 30 , 2026 | 01:11 PM
ఎరువుల తయారీ, సరఫరా.. కేంద్రం పరిధిలోని అంశమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎరువుల సరఫరా బీజేపీ బాధ్యత అని చెప్పుకొచ్చారు.
సిద్దిపేట, జూన్ 30: జిల్లాలోని హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 17, 18 వార్డుల్లో కొనసాగుతున్న సర్ (SIR) ఓటర్ సవరణ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎరువుల తయారీ, సరఫరా కేంద్రం పరిధిలోని అంశమన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఎరువులు తయారు చేసుకోరని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేదు కాబట్టి ఉద్దేశపూర్వకంగా సరఫరాలను తగ్గించి ఇబ్బందులు సృష్టిస్తోందని ఆరోపించారు. ఎరువుల సరఫరా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) బాధ్యత అని చెప్పుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వం తయారు చేసే ఎరువులతో పాటుగా తెలంగాణలో ఉన్న ఎరువుల ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని తెలంగాణ రాష్ట్రానికి అప్పగించాలని మంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడితే భారతీయ జనతా పార్టీ నాయకుల ఇళ్ల ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎరువుల కొరత విషయంలో రాష్ట్ర బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు జాగ్రత్తగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
పోకిరీలను ధైర్యంగా ఎదుర్కోవాలి.. ఘట్‌కేసర్ ఘటనపై బాధితుడి సోదరి పోస్ట్
కేసీఆర్ రైతు బాంధువుడు.. మీరు ఎప్పటికీ రైతు ద్రోహే: సీఎంపై కేటీఆర్ విమర్శలు
Read Latest Telangana News And Telugu News