ఇంజినీరింగ్ విద్యార్థినిపై లైగింక వేధింపులు.. లెక్చరర్‌పై పోక్సో కేసు..
ABN , Publish Date - Nov 23 , 2026 | 09:49 PM
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం పటేల్‌గూడలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది. పాఠాలు చెప్పాల్సిన ఓ లెక్చరర్ విద్యార్థినిని వేధింపులకు గురిచేశాడు.
సంగారెడ్డి జిల్లా, నవంబర్ 23: అమీన్‌పూర్ మండలం పటేల్‌గూడలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది. పాఠాలు చెప్పాల్సిన ఓ లెక్చరర్ విద్యార్థినిని వేధింపులకు గురిచేశాడు. ప్రతిరోజూ అసభ్యకరమైన సందేశాలు పంపుతూ మానసికంగా హింసించాడు. అతని వేధింపులు భరించలేని విద్యార్థిని ఈ విషయాన్ని తల్లిదండ్రులు, స్నేహితులకు చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
పటేల్‌గూడలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఓ విద్యార్థిని మొదటి సంవత్సరం చదువుతోంది. ఆ తరగతి విద్యార్థులకు రవి అనే లెక్చరర్ ఇంగ్లిష్ పాఠాలు బోధిస్తున్నాడు. అయితే, ఇటీవల అతడు తన వక్రబుద్ధిని బయటపెట్టుకున్నాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సింది పోయి, తానే దారి తప్పాడు. తరగతిలోని ఓ బాలికపై కన్నేసిన రవి.. ఆమె ఫోన్‌కు తరచూ సందేశాలు పంపడం ప్రారంభించాడు. రోజురోజుకూ లెక్చరర్ ప్రవర్తన శ్రుతిమించిపోయింది. చివరకు బాలికకు అసభ్యకరమైన సందేశాలు పంపే స్థాయికి చేరింది.
లెక్చరర్ వేధింపులు భరించలేని విద్యార్థిని వాట్సాప్ చాట్‌ను స్నేహితులు, కుటుంబ సభ్యులకు చూపించింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు లెక్చరర్ రవిపై దాడి చేశారు. అనంతరం అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించగా.. విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, బాధితురాలు మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఖైదీలకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించాలి: డీజీ స్వాతి లక్రా
నకిలీ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం