ఏఎస్ఐ గోవింద్ నాయక్ మృతి.. హోమ్ గార్డ్ పరార్..
ABN , Publish Date - Apr 14 , 2026 | 08:22 AM
సంగారెడ్డి జిల్లా మానూర్ ఏఎస్ఐ గోవింద్ నాయక్ ప్రమాదవశాత్తూ మృతిచెందారు. పోలీస్ స్టేషన్ ఎదుట నిలుచున్న అతనిపైకి వాహనం దూసుకెళ్లింది. అయితే, ఈ ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది.
సంగారెడ్డి: మానూర్ మండల కేంద్రంలో ఘోరప్రమాదం జరిగింది. ఏఎస్ఐ గోవింద్ నాయక్ ప్రమాదవశాత్తూ మృతిచెందారు. పోలీస్ స్టేషన్ ఎదుట నిలుచున్న అతనిపైకి పోలీస్ వాహనమే దూసుకెళ్లింది. ఏఎస్ఐకి తీవ్రగాయాలు అవ్వగా.. తోటి సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తీవ్రగాయాలతో చికిత్సపొందుతూ గోవింద్ ప్రాణాలు కోల్పోయారు.
అయితే, ఏఎస్ఐ మరణం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీస్ వాహనం నడిపిన డ్రైవర్, హోమ్ గార్డ్ రామారావు ఘటన తర్వాత పరారయ్యాడు. దీంతో బాధిత కుటుంబసభ్యులు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గోవింద్‌పై హోమ్ గార్డు కక్ష పెంచుకుని వాహనంతో ఢీకొట్టి హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. ఏఎస్ఐ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
విషాదం.. 12వ అంతస్తు నుంచి దూకి యువకుడు ఆత్మహత్య
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు కేసీఆర్ ఘన నివాళి