ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి తెలంగాణ సీఎంగా ఉన్నారు.. రేవంత్‌పై హరీశ్ ఫైర్
ABN , Publish Date - Aug 06 , 2026 | 02:25 PM
సిద్దిపేట ప్రాంతంతో ప్రొఫెసర్ జయశంకర్‌కు ఎంతో అనుబంధం ఉండేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ వచ్చింది అంటే కేసీఆర్ పోరాటం, జయశంకర్ సారు ఆరాటం వల్లే అని చెప్పుకొచ్చారు.
సిద్దిపేట, ఆగస్టు 6: సిద్దిపేట ప్రాంతంతో ప్రొఫెసర్ జయశంకర్‌కు ఎంతో అనుబంధం ఉండేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం హరీశ్ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ పోరాటం, జయశంకర్ సారు ఆరాటం వల్లే అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ కూడా జై తెలంగాణ అనలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ఈరోజు తెలంగాణ సీఎంగా ఉన్నారని విమర్శించారు. గోదావరిలో 380 TMCల నీళ్లు కేసీఆర్ నాయకత్వంలో హక్కుగా సాధించామని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్ట్‌కు కూడా అనుమతి తీసుకోలేదని మాజీ మంత్రి విమర్శించారు. GRMB చరిత్రలోనే అనుమతి ఇచ్చిన ప్రాజెక్టులను రద్దు చేయాలని, రివ్యూ చేయాలని మొదటిసారి వచ్చిందని అన్నారు. గతంలో 18 వరకు GRMB సమావేశాలు జరిగాయని.. అజెండాలో తెలంగాణ ప్రాజెక్టులను పునఃసమీక్షించాలని, ప్రాజెక్టులను రద్దు చేయాలని ఎప్పుడూ రాలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి GRMB అజెండా మార్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే GRMB మీటింగ్‌ను బహిష్కరించాలని మాజీ మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోతోందని ప్రశ్నించారు. సమ్మక్క- సారక్క ప్రాజెక్ట్‌కు 47 TMCల హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చాక ప్రభుత్వం ఎందుకు వదులుకుంటుందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. SRSP స్టేజ్ 2కు సమ్మక్క సారక్క నీళ్లు అవసరమన్నారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును నిర్మించే విషయంలో ఏపీ సర్కార్‌తో తెలంగాణ సర్కార్ లోపాయికారి ఒప్పందం చేసుకుందని హరీశ్ రావు ఆరోపించారు.
ఇవి కూడా చదవండి...
మహిళా ట్రైనీ ఐపీఎస్ కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నిస్తున్న ఉమెన్ సేఫ్టీ అధికారులు
బోనాల వేడుకల్లో మహిళలకు వేధింపులు.. 678 మందిని గుర్తించిన షీటీమ్స్
Read Latest Telangana News And Telugu News