Share News

కల్లు దుకాణం వద్ద ఘర్షణతో ఒకరి మృతి..

ABN , Publish Date - Apr 21 , 2026 | 01:57 PM

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో దారుణ హత్య జరిగింది. కల్లు దుకాణం వద్ద తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాలు తీసింది. దశరథ్ అనే వ్యక్తికి నలుగురు యువకులతో చిన్న వివాదం వచ్చింది. అయితే..

కల్లు దుకాణం వద్ద ఘర్షణతో ఒకరి మృతి..
Masaipet crime News

మెదక్ జిల్లా: మాసాయిపేట మండల కేంద్రంలో దారుణ హత్య జరిగింది. కల్లు దుకాణం వద్ద తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాలు తీసింది. దశరథ్ అనే వ్యక్తికి నలుగురు యువకులతో చిన్న వివాదం వచ్చింది. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో రెచ్చిపోయిన నిందితులు.. దశరథ్‌పై దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కొట్టారు. ఇంకా ఆవేశం చల్లారక ఏకంగా బండరాయితో తలపై మోదారు. దీంతో అతడి తలకు తీవ్రగాయాలు అయ్యాయి.


దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడిలో తీవ్రగాయాలు కావడంతో దశరథ్ పరిస్థితి విషమించింది. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. హత్య గురించి తెలుసుకున్న బాధిత కుటుంబం ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగింది. పథకం ప్రకారమే హత్య చేశారని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు.


నిందితులు నలుగురిని వెంటనే పట్టుకోవాలని, తగిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. వారికి సర్దిచెప్పేందుకు యత్నించగా పోలీసులు, బాధితుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో డీఎస్పీ నరేందర్ గౌడ్ రంగంలోకి దిగారు. ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధిత కుటుంబానికి నచ్చజెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి

సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై మరో కేసు నమోదు

అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. రూ.2.5 కోట్ల విలువైన హాష్ ఆయిల్ సీజ్

Updated Date - Apr 21 , 2026 | 01:57 PM