భూముల అన్యాక్రాంతంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్ రావు
ABN , Publish Date - Sep 17 , 2026 | 08:21 PM
కబ్జాకు గురైన ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
సిద్ధిపేట, సెప్టెంబర్ 17: కబ్జాకు గురైన ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
‘కేసీఆర్ ఫాంహౌజ్ పరిధిలో ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వం 30 నెలలుగా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు.. ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదనే పేరు తెచ్చుకోవడానికి ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారా.. లేదంటే.. ఆ ధరణి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కంట్రోల్ చేయలేనంత గొప్పదా.. ’అని రఘునందన్ రావు నిలదీశారు.
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులు అనుభవిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఎంపీ ప్రశ్నించారు. తప్పు చేసిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. 1954 పహాని, చౌఫస్లాలను పరిశీలిస్తే ఎవరి భూమి ఎంతో తెలిసిపోతుందన్నారు. ఒకవేళ దళితులు, బలహీన వర్గాలు 325 సర్వే నెంబర్‌లోని 388 ఎకరాల కబ్జా భూమిలో ఉన్నారని తెలిస్తే.. వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారాన్ని సాగదీయకుండా.. అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read:
మల్లారెడ్డి కుటుంబంపై సొంత పార్టీ నేతల ఆగ్రహం.. ప్రీతి రెడ్డి ఫ్లెక్సీలు చించివేత
385 ఎకరాల ప్రభుత్వ భూమిపై అధికారుల ఆరా.. శాటిలైట్ మ్యాప్‌లతో పరిశీలన