Share News

హైదరాబాద్‌లోని నార్సింగి మూవీ టవర్స్ సెల్లార్‌లో భారీ అగ్నిప్రమాదం

ABN , Publish Date - May 24 , 2026 | 08:54 PM

హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రముఖ నివాస సముదాయం మూవీ టవర్స్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లోని నార్సింగి మూవీ టవర్స్ సెల్లార్‌లో భారీ అగ్నిప్రమాదం
Narsingi Fire Accident

హైదరాబాద్, మే 24: నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ నివాస సముదాయం 'మూవీ టవర్స్'లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మూవీ టవర్స్‌లోని సి-బ్లాక్ సెల్లార్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సెల్లార్ నుంచి పెద్దఎత్తున దట్టమైన పొగలు కమ్ముకోవడాన్ని గమనించిన నివాసితులు.. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.


సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసే ప్రక్రియ కొనసాగించారు. మరోవైపు నార్సింగి పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అప్రమత్తమైన సిబ్బంది బ్లాక్‌లోని నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

వివాహేతర సంబంధానికి భర్త బలి.. ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం!

పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పని చేయాలి: ఎంపీ మల్లు రవి

For More TG News And Telugu News

Updated Date - May 24 , 2026 | 09:09 PM