రెండురోజులు మంజీరా నీటి సరఫరా బంద్
ABN , Publish Date - Feb 10 , 2026 | 07:55 AM
హైదరాబాద్ నగరానికి సరఫరా అయ్యే మంజీరా తాగునీళ్లు బుధవారం ఆగిపోనున్నాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగరానికి సరఫరా అయ్యే మంజీరా తాగునీళ్లు బుధవారం ఆగిపోనున్నాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పటాన్‌చెరు(Patancheru) నుంచి హైదర్‌నగర్ వరకు, కలబ్‌గూర్ నుంచి పటాన్‌చెరు వరకు ఉన్న మంజీరా ఫేజ్-2లో 1500ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్‌కు వివిధ ప్రాంతాల్లో భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. వీటిని అరికట్టేందుకు బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి గురువారం రాత్రి 10 గంటల వరకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు.
ఈ నేపథ్యంలో మంజీరా నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. దీంతో ఆర్సీపురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్(Lingampally, Chandanagar), గంగారం, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్‌పూర్, భాగ్యనగర్ కాలనీ, ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ కనెక్షన్లు, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్, కేపీహెచ్‌బీకాలనీ, కూకట్‌పల్లి, భాగ్యనగర్‌కాలనీ ప్రగతినగర్ ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం తలెత్తుతుందని, నీటిని పొందుపుగా వాడుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం, వెండి స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News