హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బూడిదైన ఫర్నిచర్..
ABN , Publish Date - Mar 13 , 2026 | 06:28 AM
హైదరాబాద్ నగరంలోని చందానగర్ ప్రాంతంలో ఉన్న ఒక ఫర్నిచర్ దుకాణంలో గురువారం అర్ధరాత్రి తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో..
హైదరాబాద్: నగరంలోని చందానగర్ ప్రాంతంలో ఉన్న ఒక ఫర్నిచర్ దుకాణంలో గురువారం అర్ధరాత్రి తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దుకాణంలోని ఐదు అంతస్తుల్లో నిల్వ చేయబడిన ఫర్నిచర్ మొత్తం తగలబడింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. 7 ఫైర్ ఇంజన్లు, 11 వాటర్ ట్యాంకర్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.

దుకాణం ఐదు అంతస్తుల భవనంలో ఉండటం, లోపల సోఫాలు, బెడ్‌లు, టేబుల్స్ తదితరాలు ఉండడం వల్ల మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్, గ్యాస్ లీకేజీ లేదా ఇతర కారణాలు ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక అధికారులు సంయుక్తంగా ఘటన స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు.ఈ ప్రమాదం కారణంగా చందానగర్ ప్రాంతంలో కొంత వరకూ సేవలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
ఫిరాయింపులను ప్రోత్సహించేలా అసెంబ్లీ స్పీకర్ తీర్పు: బండి సంజయ్
Read Latest International News And Telangana News And AP News