Share News

‘తూర్పు పొడజాతి’కి పొద్దు పొడుపు!

ABN , Publish Date - Nov 19 , 2026 | 05:38 AM

తెలంగాణ, ఏపీలో మేలైన పశుజాతిగా గుర్తింపుపొందిన ‘తూర్పు పొడజాతి’ ఎడ్లు, ఆవుల సంతతి సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనుంది.

‘తూర్పు పొడజాతి’కి పొద్దు పొడుపు!

  • మేలైన జాతి ఎడ్లు, ఆవుల సంరక్షణకు చర్యలు

  • అమ్రాబాద్‌ వద్ద వందల ఎకరాల భూసేకరణ

నాగర్‌కర్నూల్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఏపీలో మేలైన పశుజాతిగా గుర్తింపుపొందిన ‘తూర్పు పొడజాతి’ ఎడ్లు, ఆవుల సంతతి సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ పశుజాతి సంతతిని పెంపొందిచి.. పరిరక్షించేందుకుగాను నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండల పరిధిలో దాదాపు వంద ఎకరాలను సేకరించనున్నారు. అక్కడ పరిశోధనా సంస్థ, వెటర్నరీ పాలిటెక్నిక్‌ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి వచ్చే వారం నల్లమల పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ జాతి ఎడ్లను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గిత్తగా ప్రకటించడంతో సంరక్షణ కోసం పశుసంవర్ధక శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.


ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొనగలగడం తూర్పు పొడ జాతి ఎడ్లు, ఆవుల ప్రత్యేకత. మారనున్న వాతావరణ పరిస్థితులను పసిగట్టి తమ కదలికల ద్వారా రైతులకు ఈ జాతి పశువులు సంకేతాలిస్తాయి. వర్షం పడే సూచనలు ఉంటే పొలం పనులు ఆపేసి ఇంటివైపు వెళ్లాలన్నట్టుగా సూచనలిస్తాయి. కొండలు, కోనలు, నల్లమలలో లభించే గడ్డిని మేస్తూనే తమకు అవసరమైన పోషక గుణాలు కలిగిన మొక్కలను ఎంచుకొని తినడం వీటికున్న మరో ప్రత్యేకత. ఈ జాతి ఆవులు అడవిలో మేస్తుండగానే 3-4 లీటర్ల పాలనిస్తాయి. తమ దూడలను కంటికి రెప్పలా కాపాడుకుంటాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం

బాబా బర్త్‌డే స్పెషల్‌.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 05:38 AM