Share News

క్రైమ్‌లో బీహార్, ఉత్తరప్రదేశ్‌లాగా తెలంగాణ తయారైంది: కేటీఆర్

ABN , Publish Date - May 04 , 2026 | 05:19 PM

తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా పట్టుతప్పాయని, రాష్ట్రం బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మాదిరిగా మారిపోయిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.

క్రైమ్‌లో బీహార్, ఉత్తరప్రదేశ్‌లాగా తెలంగాణ తయారైంది: కేటీఆర్
KTR Comments Telangana

హైదరాబాద్, మే 04: తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా పట్టుతప్పాయని, రాష్ట్రం బీహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల మాదిరిగా మారిపోయిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రక్షణ వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని, పోలీసు శాఖ పటిష్టత లోపించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయడం లేదని, శాంతిభద్రతలను కాపాడే రక్షణ వ్యవస్థ కుదేలైందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉండేదని, నేరస్థులు చట్టానికి భయపడే వారని అన్నారు.


ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో శాంతి భద్రతలు పట్టు తప్పాయి. సీసీ కెమెరాలు పని చేయడం లేదు, రక్షణ వ్యవస్థ క్షీనించింది. రాష్ట్రంలో తుపాకులతో కాల్పులు జరుగుతుంటే.. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఏం చేస్తోంది. కరీంనగర్‌లో పట్టపగలు దాడులు జరిగినా.. ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. బాధితులను పరామర్శించడానికి కూడా ఎవరూ రాలేదు. దోచుకో, దాచుకో అన్నట్లుగా రాష్ట్రంలో నేరస్థులకు ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందా?. కాంగ్రెస్ నేతలు దోచుకుంటున్నట్లే.. దొంగలను కూడా దోచుకోమంటున్నారా? ప్రతిపక్షాలను అరెస్ట్ చేయడంపై ఉన్న శ్రద్ధ, ప్రజలను కాపాడడంలో లేదా? శాంతిభద్రతలను గాడిలో పెట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నేరాల నియంత్రణపై తక్షణమే దృష్టి సారించాలి’ అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేరళం పీసీసీ కార్యాలయంలో మిన్నంటిన సంబరాలు.. వీడియోలు వైరల్

ఏఐఏడీఎంకేతో విజయ్‌ చేతులు కలుపుతారా?

For More TG News And Telugu News

Updated Date - May 04 , 2026 | 06:58 PM