Share News

కొత్త ప్రాజెక్టులకు అనుమతి తప్పనిసరి.. ఏపీ, తెలంగాణకు కేఆర్ఎంబీ కీలక సూచనలు

ABN , Publish Date - Nov 19 , 2026 | 08:52 PM

కొత్త ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాలు.. ఏపీ, తెలంగాణకు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (కేఆర్ఎంబీ) గురువారం పలు కీలక సూచనలు చేస్తూ లేఖ రాసింది. అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టవద్దని స్పష్టం చేసింది.

కొత్త ప్రాజెక్టులకు అనుమతి తప్పనిసరి.. ఏపీ, తెలంగాణకు కేఆర్ఎంబీ కీలక సూచనలు

హైదరాబాద్, నవంబర్19: కొత్త ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాలు.. ఏపీ, తెలంగాణకు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (కేఆర్ఎంబీ) గురువారం పలు కీలక సూచనలు చేస్తూ లేఖ రాసింది. అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టవద్దని స్పష్టం చేసింది. KWDT-II అవార్డు వచ్చే వరకు చట్టబద్ధమైన విధానాలు పాటించాలని సూచించింది. కేఆర్ఎంబీ పరిధిని సుప్రీంకోర్టులో సవాలు చేసిన తెలంగాణ వైఖరిపై ఈ లేఖలో ప్రస్తావించింది. కేఆర్ఎంబీ పరిధినే సవాలు చేస్తూ.. అదే బోర్డు జోక్యం కోరడం పరస్పర విరుద్ధమని వ్యాఖ్యానించింది.


బోర్డులో ఏకాభిప్రాయం లేకుండా వివాదాస్పద అంశాలపై నిర్ణయాలు కష్టమని కేఆర్ఎంబీ వెల్లడించింది. బోర్డు నిర్ణయాల అమలులో వైఫల్యమైతే కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కొత్త ప్రాజెక్టులకు ముందస్తు సాంకేతిక పరిశీలన, బోర్డు అనుమతి తప్పనిసరి అని కుండబద్దలు కొట్టింది. ఆ తర్వాతే అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలని వెల్లడించింది. మిగులు జలాలు ఉన్నాయనే అంచనాతో నీటి వినియోగంపై హక్కులు రావని తెలుగు రాష్ట్రాలకు తేల్చి చెప్పింది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు సంబంధిత ట్రిబ్యునల్ పరిధిలోనే ఉంటాయని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కాకినాడ, శ్రీకాకుళం కార్పొరేషన్ల ఎన్నికలకు జనసేన కమిటీలు..

వికారాబాద్‌ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 15 ఎకరాల్లో పంటలు దగ్ధం

For More AP News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 09:15 PM