Share News

కాకినాడ, శ్రీకాకుళం కార్పొరేషన్ల ఎన్నికలకు జనసేన కమిటీలు..

ABN , Publish Date - Nov 19 , 2026 | 07:42 PM

ఏపీలో రెండో దశ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. పొత్తులో భాగంగా కాకినాడ, శ్రీకాకుళం కార్పొరేషన్ల మేయర్ పదవులు జనసేన పార్టీకి కేటాయించారు.

కాకినాడ, శ్రీకాకుళం కార్పొరేషన్ల ఎన్నికలకు జనసేన కమిటీలు..

అమరావతి, నవంబర్19: రాష్ట్రంలో రెండో దశ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. పొత్తులో భాగంగా కాకినాడ, శ్రీకాకుళం కార్పొరేషన్ల మేయర్ పదవులు జనసేన పార్టీకి కేటాయించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సమన్వయ కమిటీలను జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురువారం నియమించారు. అందుకు సంబంధించిన జాబితాను జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది.

ఎన్నికల్లో స్థానికంగా జనసేన పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి, కూటమి పార్టీలతో నిరంతర సమన్వయం చేసుకునేందుకు ఈ కమిటీలు పనిచేస్తాయి. అలాగే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి చోటా గెలుపు సాధించేలా ఆయా ప్రాంత నాయకుల సమన్వయంతో ఈ కమిటీలు కృషి చేస్తాయి. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం స్పష్టం చేసింది.


కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సమన్వయకర్తలు

1. శ్రీ కందుల దుర్గేష్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి

2. శ్రీ కొణతాల రామకృష్ణ, అనకాపల్లి శాసనసభ్యులు

3. శ్రీ పిడుగు హరిప్రసాద్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ

4. శ్రీ బొమ్మిడి నాయకర్, ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే

5. శ్రీ బత్తుల బలరామకృష్ణ, రాజానగరం ఎమ్మెల్యే

6. శ్రీ గిడ్డి సత్యనారాయణ, పి. గన్నవరం ఎమ్మెల్యే

7. శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, APMSIDC చైర్మన్

8. శ్రీ సామినేని ఉదయభాను, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు

9. శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్

10. ⁠శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి, వడ్డెర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్


శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికల సమన్వయకర్తలు

1. శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ దక్షిణ నియోజక వర్గ శాసనసభ్యులు

2. శ్రీ సుందరపు విజయ్ కుమార్, ఎలమంచిలి ఎమ్మెల్యే

3. శ్రీమతి లోకం మాధవి, నెల్లిమర్ల ఎమ్మెల్యే

4. శ్రీ నిమ్మక జయకృష్ణ, పాలకొండ ఎమ్మెల్యే

5. శ్రీ టి. శివశంకర్, ఏపీ ఎంఎస్ఎంఈ, చైర్మన్

6. శ్రీ కొరికాన రవికుమార్, సుడా ఛైర్మన్

7. శ్రీ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు మేయర్

8. శ్రీమతి పాలవలస యశస్వి, రాష్ట్ర తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్

9. శ్రీ పెనుగొండ సుబ్బారాయుడు

10. శ్రీ దుగ్గిశెట్టి సుజయ్ బాబు


ఈ వార్తలు కూడా చదవండి..

వికారాబాద్‌ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 15 ఎకరాల్లో పంటలు దగ్ధం

రహదారుల నిర్మాణాల్లో ఎక్కడ రాజీ పడొద్దు: ఇంజినీర్లకు కేంద్రమంత్రి సూచన

For More AP News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 07:58 PM