ఇక్కడ ఓట్లు అమ్మబడవు...
ABN , Publish Date - Feb 03 , 2026 | 01:41 PM
పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల సందడి జోరుగా సాగుతోంది. అలాగే ఓట్లకోసం ప్రధాన పార్టీ నేతలు పడరానిపాట్లు పడుతుండగా... కొంతమంది వ్యక్తులు మాత్రం తమ నిజాయతీని చాటుకుంటున్నారు. అశ్వారావుపేట పట్టణంలోని ఓ వ్యక్తి ఇక్కడ ఓట్లు అమ్మబడవు.. అంటూ ఫ్లెక్సీ కట్టారు. వివరాలిలా ఉన్నాయి.
అశ్వారావుపేట(భద్రాద్రి కొత్తగూడెం): ఇక్కడ నోటుకు ఓటు అమ్మబడవు అంటూ అశ్వారావుపేట(Ashwaraopet)లో అప్పారావు అనే ఓ వ్యక్తి తన ఇంటి ముందు గేటుకు ఫ్లెక్సీ కట్టారు. అశ్వారావుపేటలో మునిసిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. వార్డు, నిలబడిన అభ్యర్థులనుబట్టి ఓటుకు ఇంత ఇస్తారంట అంటూ పట్టణంలో రకరకాల ప్రచారం జరుగుతుంది. పట్టణానికి చెందిన ఎలక్ర్టికల్ వ్యాపారి అప్పారావు(Apparao) తమ ఇంట్లో ఓట్లు నోటుకు అమ్మబడవు అంటూ ఫ్లెక్సీ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అందరూ ఈ విధంగా డబ్బులు వద్దంటే బాగుండునేమో అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి.
దిగి వస్తున్నాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రైల్వే బడ్జెట్‌లో.. రాష్ట్రానికి 10134 కోట్లు
Read Latest Telangana News and National News