గంజాయి రవాణా అరికట్టేందుకు కార్యాచరణ: డీజీపీ సీవీ ఆనంద్
ABN , Publish Date - Jul 06 , 2026 | 04:03 PM
రాష్ట్రంలో గంజాయి రవాణాను అరికట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం అని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో నూతన పోలీస్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు.
మణుగూరు, జులై 06: రాష్ట్రంలో గంజాయి రవాణాను అరికట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం అని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో నూతన పోలీస్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్ అధికారి డ్రగ్స్‌పై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గంజాయి పెంచే వారిని తీవ్రవాదుల కంటే ఎక్కువగా పరిగణిస్తామని హెచ్చరించారు. ప్రజలకు మంచి సేవలు అందించాలని ఈ సందర్భంగా పోలీసులకు ఆయన సూచించారు.
ప్రజలకు ఆటంకం కలగకుండా శాంతి భద్రతలు కాపాడాలని పోలీసులకు తెలంగాణ డీజీపీ స్పష్టం చేశారు. ఏఐ టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పోలీసులకు వివరించారు. యువత డ్రగ్స్‌కి అలవాటు కాకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మావోయిస్టులను పూర్తిగా అదుపు చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం కొత్తగా మాదక ద్రవ్యాలు, సైబర్ క్రైమ్స్, రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాలని పోలీసులకు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీల సంక్షేమానికి రికార్డు స్థాయిలో కేటాయింపులు: మంత్రి సవిత
కాళేశ్వరం పేరుతో కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారు.. మంత్రి సీతక్క ఎద్దేవా
For TG News And Telugu News