Share News

పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలన్నది మా ప్రభుత్వ సంకల్పం: డిప్యూటీ సీఎం

ABN , Publish Date - Mar 11 , 2026 | 08:19 PM

ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ(బుధవారం) ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలన్నది మా ప్రభుత్వ సంకల్పం: డిప్యూటీ సీఎం
Bhatti Vikramarka

ఖమ్మం జిల్లా, మార్చి 11: ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ(బుధవారం) ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 22, 500 కోట్లతో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామని అన్నారు.


' ప్రతిపక్షాలు ఈ ప్రజా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి . కొందరు ప్రభుత్వానికి అడ్డుపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో పేదల నిస్సహాయతను అడ్డు పెట్టుకుని దోపిడీకి పాల్పడ్డారు. కానీ ఈ ప్రభుత్వం పేద వాళ్ల అభివృద్ధి కోసం కృషి చేస్తోంది. ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలి అన్నది ఈ ప్రభుత్వ సంకల్పము. ఇవాళ 412 మంది లబ్ధిదారులను గుర్తించి న్యాయం చేస్తున్నాము. ఇకపై మీరెవరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇకపై నిర్భయంగా ఆత్మగౌరవంతో మీ ఇంట్లో మీరు బతకొచ్చు' అని వెలుగుమట్ల నిర్వాసితులకు భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు.


'దళారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వెంటనే మీ అందరి చేత భూమి పూజ చేయించి నిర్మాణం మొదలు పెట్టిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశంతో రేపే నిర్మాణ పనులను ప్రారంభిస్తాం. మీరు కట్టుకునే నూతన ఇళ్ల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తారు. పదేళ్ల పాటు దుర్మార్గమైన పాలన చేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని మోసం చేసిన మీరు మమ్మల్ని ఆక్షేపిస్తారా? . ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. దళారీల భరతం పడతాం. భూదాన్ నిర్వాసితులు ధైర్యంగా బతకండి. ఆత్మగౌరవంతో నిలబడండి. మేము అండగా ఉంటాము. ఇళ్ల స్థలాలు ఇవ్వగా మిగిలిన 16 ఎకరాలలో అత్యున్నత వసతులతో ఇంగ్లీష్ మీడియం కోసం పాఠశాల కట్టిస్తాము'అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.


ఇవి కూడా చదవండి:

సభలో మాట్లాడే అవకాశం రాహుల్‌కి ఇవ్వలేదు: ఎంపీ మల్లు

ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్.. తెలంగాణకు మచ్చ: బీజేపీ ఎంపీ

Updated Date - Mar 11 , 2026 | 09:07 PM