Share News

సభలో మాట్లాడే అవకాశం రాహుల్‌కి ఇవ్వలేదు: ఎంపీ మల్లు

ABN , Publish Date - Mar 11 , 2026 | 05:32 PM

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తీరుపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం న్యూఢిల్లీలో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్ సభలో ఎంపీ మల్లు రవి మాట్లాడారు.

సభలో మాట్లాడే అవకాశం రాహుల్‌కి ఇవ్వలేదు: ఎంపీ మల్లు
MP Mallu Ravi

న్యూఢిల్లీ, మార్చి 11: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తీరుపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం న్యూఢిల్లీలో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్ సభలో ఎంపీ మల్లు రవి మాట్లాడారు. పార్లమెంట్ సంస్థలు పార్టీల రాజకీయాలను మించి ఉండాలని అభిప్రాయపడ్డారు. సభలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వ లేదని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల స్వరాలను అణచివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


స్పీకర్ పదవి రాజకీయాలకు అతీతంగా ఉండాలని ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. మహిళా ఎంపీలపై స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. మహిళా ఎంపీల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ ఎంపీ మల్లు రవి విమర్శించారు. ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలపై ఉన్న సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.


ప్రజా సమస్యలు లేవనెత్తినందుకే సదరు ఎంపీలను సస్పెండ్ చేశారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలను ఎంపీ మల్లు రవి ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటూ పూర్తిగా రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 14ను బ్లాక్ డే అనడం తప్పు అంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్.. తెలంగాణకు మచ్చ: బీజేపీ ఎంపీ

మావోయిస్టులకు మరో భారీ దెబ్బ

For More TG News And Telugu News

Updated Date - Mar 11 , 2026 | 05:48 PM