Share News

పీఎంజే బంగారం షాపు దోపిడీ.. మరో ఇద్దరు దొంగలు అరెస్ట్

ABN , Publish Date - Jun 23 , 2026 | 09:35 AM

కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షాపు దోపిడి కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యమణి, అదిల్ ఖాన్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

పీఎంజే బంగారం షాపు దోపిడీ.. మరో ఇద్దరు దొంగలు అరెస్ట్
PMJ Jewellers Robbery In KarimNagar

కరీంనగర్, జూన్ 23: నగరంలోని పీఎంజే జ్యువెలరీ షాపు దోపిడి కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యమణి, అదిల్ ఖాన్ అనే ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పిస్తోల్, మ్యాగజైన్, బైక్‌తోపాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరి అరెస్ట్‌తో.. ఈ దోపిడి కేసులో అరెస్టయిన వారి సంఖ్య మూడుకి చేరింది. ఈ దోపిడిలో మొత్తం ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నారు.


ఈ బంగారం షాపు చోరీ సమయంలో సూర్యమణి అలియాస్ సనోజ్ కుమార్‌ కాల్పులు జరిపినట్లు పోలీసులు సీసీ టీవీ కెమెరాలలో గుర్తించారు. అదిల్ ఖాన్‌ను బిహార్ రాజధాని పాట్నా సమీపంలోని పుల్వారి షరీఫ్ ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బృందం అదుపులోకి తీసుకుంది. అక్కడి కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ ద్వారా రెండు రోజుల్లో అతడిని కరీంనగర్ తీసుకు వస్తారని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులతోపాటు ఈ దోపిడికి సహకరించిన ఎనిమిది మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.


ఈ ఏడాది మే 3వ తేదీన కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షాపులో భారీగా బంగారం చోరీ జరిగింది. బైక్‌లపై సాధారణ కస్టమర్లలాగా వచ్చిన ఐదుగురు నిందితులు.. షాపులో క్షణాల్లో బీభత్సం సృష్టించారు. తుపాకులతో షాపులోని సిబ్బందిని బెదిరించడంతో పాటు.. వారిపై కాల్పులు జరిపారు. దీంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఈ దోపిడి అనంతరం బంగారం షాపు పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. ఈ దోపిడి కేసులో చిక్కినవారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ తగ్గిన బంగారం ధరలు..

తండ్రి కొడుకుల పీక కోసిన యువకుడు.. నిందితుడి కోసం పోలీసుల గాలింపు

For More TG News And Telugu News

Updated Date - Jun 23 , 2026 | 09:56 AM