Share News

జగిత్యాలలో ఏడో తరగతి బాలిక మిస్సింగ్

ABN , Publish Date - Aug 06 , 2026 | 03:43 PM

జగిత్యాల జిల్లాలో బాలిక అదృశ్యం కలకలం రేపుతోంది. కండ్లపల్లి మోడల్ స్కూల్‌లో 7వ తరగతి విద్యార్థిని బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది.

జగిత్యాలలో ఏడో తరగతి బాలిక మిస్సింగ్
Jagitial girl missing

జగిత్యాల, ఆగస్టు 6: జిల్లాలో బాలిక అదృశ్యం కలకలం రేపుతోంది. కండ్లపల్లి మోడల్ స్కూల్‌లో 7వ తరగతి విద్యార్థిని నిన్న(బుధవారం) సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. బాలిక మిస్సింగ్‌పై తల్లిదండ్రులకు ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ సమాచారం అందించారు. బాలిక.. స్కూల్‌లోనే డ్రెస్ మార్చుకుని వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో గుర్తించారు. బుక్స్, బ్యాగ్, బూట్లు స్కూల్‌లోనే వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బ్యాగ్‌లో సూసైడ్ నోట్ లభించినట్లు సమాచారం. ‘తల్లిదండ్రులతో ఇబ్బందిగా ఉంది.. చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు’ అంటూ నోట్‌లో రాసినట్లు తెలుస్తోంది.


‘ఇక్కడ ఉండలేను, చనిపోవడానికి వెళ్తున్నాను’ అంటూ బాలిక సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి తెలంగాణ సీఎంగా ఉన్నారు.. రేవంత్‌పై హరీశ్ ఫైర్

అణగారిన వర్గాల కోసం చివరి వరకూ పోరాటం చేస్తా: కవిత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 06 , 2026 | 04:43 PM