Share News

మద్యం తాగొద్దన్న పిల్లలు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న తల్లి..

ABN , Publish Date - Jun 13 , 2026 | 10:59 AM

మద్యం అలవాటును మానుకోవాలని కన్నబిడ్డలు చెప్పడంతో అది తట్టుకోలే ఓ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది.

మద్యం తాగొద్దన్న పిల్లలు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న తల్లి..
Kamareddy News

కామారెడ్డి, జూన్ 13: జిల్లాలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మద్యం అలవాటును మానుకోవాలని కన్నబిడ్డలు సూచించారు. పిల్లల మందలించారని ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. చివరకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.


పోలీసుల కథనం మేరకు.. రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన అల్లపు లక్ష్మి (35) అనే మహిళ మద్యానికి బానిసలైంది. ఈ క్రమంలో ఆమె ప్రవర్తనపై పిల్లలు ఆందోళన చెందారు. మద్యం తాగడం ఆరోగ్యానికి, కుటుంబానికి మంచిది కాదని.. ఆ అలవాటును మానుకోవాలని పిల్లలు గట్టిగా మందలించారు. కన్నపిల్లలే తనను అలా మందలించడాన్ని లక్ష్మి తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న రామారెడ్డి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

అమరావతి నిర్మాణాలపై తప్పుడు ప్రచారం మానుకోవాలి: మంత్రి నారాయణ

హైదరాబాద్‌లో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ భగ్నం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 11:47 AM