Share News

మాజీ ఎంపీ కేశినేని నానిపై కేసు నమోదు..

ABN , Publish Date - Jun 13 , 2026 | 09:39 AM

మాజీ ఎంపీ కేశినేని నానిపై పోలీసు కేసు నమోదైంది. తనపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మాజీ ఎంపీ కేశినేని నానిపై కేసు నమోదు..
Kesineni Nani

అమరావతి, జూన్13: మాజీ ఎంపీ కేశినేని నానిపై పోలీసు కేసు నమోదైంది. తనపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అక్రమంగా తాను లబ్ధి పొందుతున్నట్లు నాని బహిరంగ లేఖ విడుదల చేశారని చిన్ని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బినామీ పేర్లతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నట్లు నాని చేసిన ఆరోపణలపై గతంలో చిన్ని లీగల్ నోటీసులు పంపారు.


ఆ లీగల్ నోటీసులకు నాని రిప్లై ఇవ్వకపోగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ కేశినేని చిన్ని పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు U/s 204, 351, 352, 353, 356, 61 BNS అండ్ 66, 66(C ),66(D),67,72 IT యాక్ట్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.


ఇవి కూడా చదవండి

సర్కారు బడులు సన్నద్ధం

నేడు భారత్- అఫ్గాన్ మ్యాచ్‌.. అంత‌లోనే స్టార్‌ క్రికెట‌ర్ తండ్రి మృతి

Updated Date - Jun 13 , 2026 | 11:05 AM