Share News

హైదరాబాద్‌లో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ భగ్నం

ABN , Publish Date - Jun 13 , 2026 | 09:53 AM

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధిలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్‌ను పోలీసులు భగ్నం చేశారు. వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌పై పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు.

హైదరాబాద్‌లో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ భగ్నం
Illegal Gender Determination Racket

హైదరాబాద్, జూన్ 13: నగరంలోని ఎల్బీనగర్ పరిధిలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్‌ను పోలీసులు భగ్నం చేశారు. వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌పై పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. హాస్పిటల్ డైరెక్టర్ కొర్ర రాజు సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మహిళా పోలీసును డెకాయ్‌గా పంపి ఆధారాలు సేకరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తామంటూ హాస్పిటల్ సిబ్బంది హామీ ఇచ్చారు. నిందితులు తుక్కుగూడలోని ఓ క్లినిక్‌కు గర్భిణులను రిఫర్ చేశారు.


క్లినిక్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్‌ను పోలీసులు పట్టుకున్నారు. రిసెప్షనిస్ట్ లోకేశ్‌ను కూడా అరెస్ట్ చేశారు. హాస్పిటల్ డైరెక్టర్‌తో సహా ముగ్గురిపై పీసీపీఎన్‌డీటీ(PCPNDT) చట్టం కింద కేసు నమోదు చేశారు. గర్భంలోని శిశువు లింగాన్ని వెల్లడించడం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు. అక్రమ లింగ నిర్ధారణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ అంశంపై కేసు నమోదు చేసిన వనస్థలిపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

ప్రజాసేవకు పునరంకితం

అమరావతి నిర్మాణాలపై తప్పుడు ప్రచారం మానుకోవాలి: మంత్రి నారాయణ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 10:42 AM