Share News

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన జెండా ఎగరడం ఖాయం: గడల శ్రీనివాస్

ABN , Publish Date - Sep 13 , 2026 | 05:47 PM

తెలంగాణలో తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు జనసేన వడివడిగా అడుగులు ముందుకేస్తుంది. ‘జనసేన తెలంగాణ శంఖారావం’ పేరుతో ఖమ్మంలో సభను నిర్వహించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకేంద్రంలో జనసేన జెండానే ఎగురుతుందని ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ గడల శ్రీనివాస్ విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన జెండా ఎగరడం ఖాయం: గడల శ్రీనివాస్
janasena rally in khammam

ఖమ్మం, సెప్టెంబర్ 13: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘జనసేన శంఖారావం’ కార్యక్రమంగా ఘనంగా జరిగింది. పార్టీ కార్యకర్తలందరూ జనసేన శంఖారావం పేరిట ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంబీ గార్డెన్స్‌లో గడల శ్రీనివాస్ ఆధ్యర్యంలో ‘జనసేన తెలంగాణ శంఖారావం’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు.


శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో జనసేన పార్టీయే విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఖమ్మం జిల్లా తరఫున మంత్రివర్గంలో కీలకపాత్ర పోషిస్తున్న నేతలు ఓటమిని చవిచూడడం ఖాయమని ఆయన అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. జిల్లాలో ఈ సారి ఏ కాంగ్రెస్ నేత కూడా అధికారంలోకి రాడని ఆయన అన్నారు.


తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన : శ్రీనివాస్

జనసేన సహకారం లేకుండా తెలంగాణలో ఏ పార్టీ అధికారాన్ని పొందలేదని శ్రీనివాస్ అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో జనసేన ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి జనసేన కట్టుబడి ఉంటుందని శ్రీనివాస్ అన్నారు. యువతకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన మాట ఇచ్చారు. ప్రజాసమస్యలను పరిష్కరించడమే తమ ప్రథమ కర్తవ్యమని శ్రీనివాస్ పేర్కొన్నారు.


బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే: జనసేన నేత శంకర్ గౌడ్

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని.. రాష్ట్రాన్ని దోచుకోవడంలో వాటికవే పోటీ పడుతున్నాయని శంకర్ గౌడ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ధరణి పేరుతో భూదందాకు పాల్పడితే.. కాంగ్రెస్ భూ భారతి పేరుతో అక్రమాలకు తెరలేపిందని ఆరోపించారు. ఈ పార్టీలు భూకబ్జాలకు పాల్పడుతూ.. కోట్లు గడిస్తున్నాయని విమర్శించారు. ధరణి, భూ భారతి అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే, తెలంగాణలో 22A నిషేధిత భూముల వ్యవహారంపై జనసేన ఆధ్యర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని శంకర్ గౌడ్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు జగన్: హోంమంత్రి అనిత..

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరగలేదు: ఏపీ జూడో అసోసియేషన్

Updated Date - Sep 13 , 2026 | 07:43 PM