Share News

జగిత్యాల జీజీహెచ్‌కు స్పెషాలిటీ హబ్ హోదా: మంత్రి దామోదర రాజనర్సింహ

ABN , Publish Date - Jul 28 , 2026 | 05:28 PM

జగిత్యాల జీజీహెచ్‌కు స్పెషాలిటీ హబ్ హోదా కల్పించనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ సచివాలయంలో జగిత్యాల జిల్లా వైద్య సేవలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

జగిత్యాల జీజీహెచ్‌కు స్పెషాలిటీ హబ్ హోదా: మంత్రి దామోదర రాజనర్సింహ
Jagtial Government Hospital

హైదరాబాద్, జులై 28: జగిత్యాల జీజీహెచ్‌కు స్పెషాలిటీ హబ్ హోదా కల్పించనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ సచివాలయంలో జగిత్యాల జిల్లా వైద్య సేవలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని (జీజీహెచ్) అన్ని స్పెషాలిటీ వైద్య సేవలు అందించే కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక వసతులతో కొత్త ఆస్పత్రి భవన నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే జగిత్యాల మెడికల్ కాలేజీలో అన్ని పీజీ కోర్సులకు దరఖాస్తు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోరుట్ల, మెట్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రులకు త్వరలోనే స్పెషలిస్ట్ వైద్యులను నియమించనున్నట్లు వెల్లడించారు.


రాష్ట్ర వ్యాప్తంగా 1,616 స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టుల్లో ఇప్పటికే 1,182 నియామకాలు పూర్తయ్యాయని, గత రెండున్నరేళ్లలో ఆరోగ్యశాఖలో 15 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు. జగిత్యాలలో త్వరలో క్రిటికల్ కేర్ బ్లాక్‌తో పాటు ట్రామా కేర్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. సెంట్రల్ మెడిసినల్ స్టోర్ ద్వారా జిల్లా ఆస్పత్రులకు నిరంతర ఔషధాల సరఫరా జరుగుతోందని, సిజేరియన్ డెలివరీలు తగ్గించి నార్మల్ డెలివరీలను ప్రోత్సహించేందుకు నర్సులకు మిడ్‌వైఫరీ శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. జగిత్యాల జీజీహెచ్‌ను స్పెషాలిటీ హబ్‌గా, కరీంనగర్‌ను సూపర్ స్పెషాలిటీ హబ్‌గా అభివృద్ధి చేస్తూ, సబ్ సెంటర్ల నుంచి జిల్లా ఆస్పత్రుల వరకు ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.


Also Read:

అవసరమైతే మిమ్మల్ని కూడా వ్యతిరేకిస్తా.. రాహుల్ గాంధీతో జెన్ జీ నిరసనకారుడు ఇర్ఫాన్

భార్యకు ఉరేసి.. ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్..

Updated Date - Jul 28 , 2026 | 06:05 PM