చాట్ యాప్‌లలో సైబర్ నేరాల నివారణపై సుప్రీంకోర్టు దృష్టి
ABN , Publish Date - Jul 28 , 2026 | 05:22 PM
చాట్ యాప్‌లలో సైబర్ నేరాల నివారణపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. డిజిటల్ అరెస్ట్ మోసాలకు సంబంధించిన సుమోటో కేసును సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది.
న్యూఢిల్లీ, జులై 28: చాట్ యాప్‌లలో సైబర్ నేరాల నివారణపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. డిజిటల్ అరెస్ట్ మోసాలకు సంబంధించిన సుమోటో కేసును సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. విచారణ సందర్భంగా దీర్ఘకాలిక సందేహాస్పద కాల్స్‌ను నిలిపివేసేలా 'కిల్ స్విచ్' ఏర్పాటుపై చర్చ జరిగింది. బాధితులను రక్షించేందుకు అమికస్ క్యూరీ రెండంచెల భద్రతా విధానాన్ని ప్రతిపాదించింది. కాల్ మధ్యలో 'పాప్-అప్ వార్నింగ్' ఇవ్వాలని సుప్రీంకోర్టుకు సూచించింది. బాధితుడు తేరుకునేలా ఆటోమేటిక్‌గా కాల్ కట్ అయ్యే సాంకేతికతపై పలు ప్రతిపాదనలను కోర్టు ముందు ఉంచింది. సైబర్ మోసాలను గుర్తించేందుకు ఏఐ సాంకేతికతను వాడాలని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
కిల్ స్విచ్ అంటే ఏమిటి?
వాట్సాప్, టెలిగ్రామ్ వంటి చాట్ యాప్‌లలో ఎవరైనా గంటల తరబడి అనుమానాస్పదంగా వీడియో లేదా ఆడియో కాల్స్ చేస్తూ అవతలి వ్యక్తిని భయపెడుతుంటే.. నిర్దిష్ట సమయం తర్వాత ఆ కాల్ ఆటోమేటిక్‌గా కట్ అయిపోయేలా చేసే సాంకేతిక వ్యవస్థే ఈ ‘కిల్ స్విచ్’. కాల్ ఆటోమేటిక్‌గా కట్ అవ్వటం వల్ల భయాందోళనలో ఉన్న బాధితుడికి ఆలోచించుకోవడానికి, స్కామర్ల మైండ్ గేమ్‌ల నుంచి తేరుకోవడానికి, కుటుంబ సభ్యులను సంప్రదించడానికి సమయం దొరుకుతుంది.
ఇవి కూడా చదవండి
సైబర్ నేరాలకు మరణశిక్ష.. కీలక బిల్లుకు మయన్మార్ పార్లమెంట్ ఆమోదం
ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టు కోచ్‌గా జినడిన్ జిదాన్.. 2030 వరకు ఒప్పందం