Share News

కోర్టు వీడియోలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. అనుమతి లేకుండా పోస్టు చేస్తే చర్యలు

ABN , Publish Date - Jul 28 , 2026 | 03:11 PM

కోర్టు విచారణల వీడియోల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా కోర్టు ఆడియో, వీడియో రికార్డింగ్‌లను సోషల్ మీడియా లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేయడంపై ఆంక్షలు విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

కోర్టు వీడియోలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. అనుమతి లేకుండా పోస్టు చేస్తే చర్యలు
Supreme Court Video Guidelines

న్యూఢిల్లీ: కోర్టు విచారణల వీడియోలపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు వీడియోలను అనుమతి లేకుండా సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం చేయడంపై కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. కోర్టు విచారణలకు సంబంధించిన వీడియోలను ముందస్తు అనుమతి లేకుండా పోస్ట్ చేయడం, ఎడిట్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం, తిరిగి షేర్ చేయడం (రీ-పోస్ట్), మానిటైజ్ చేయడం నిషేధం. కోర్టు రికార్డింగ్‌లను అనుమతి లేకుండా భద్రపరచడం లేదా ప్రసారం చేయడం కూడా నిబంధనల ఉల్లంఘనగా పరిగణించనుంది.


అయితే, మీడియా సంస్థలకు మాత్రం కోర్టు కేసులపై రిపోర్టింగ్ చేయడంపై ఎలాంటి ఆంక్షలు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గుర్తింపు పొందిన వార్తా సంస్థల రిపోర్టింగ్ హక్కులకు ఎలాంటి భంగం కలగదని పేర్కొంది. కోర్టు విచారణలకు సంబంధించిన వార్తలను మీడియా సంస్థలు యథావిధిగా ప్రజలకు అందించవచ్చని తెలిపింది.


Also Read:

అవసరమైతే మిమ్మల్ని కూడా వ్యతిరేకిస్తా.. రాహుల్ గాంధీతో జెన్ జీ నిరసనకారుడు ఇర్ఫాన్

భార్యకు ఉరేసి.. ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్..

Updated Date - Jul 28 , 2026 | 03:34 PM