Share News

రేవంత్ రెడ్డి ఆట మొదలు పెట్టాడు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 11 , 2026 | 11:38 AM

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నారని, ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికీ తమ పూర్తి మద్దతు ఉంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు..

రేవంత్ రెడ్డి ఆట మొదలు పెట్టాడు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Jaggareddy

సంగారెడ్డి, జులై 11: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నారని, ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికీ తమ పూర్తి మద్దతు ఉంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాను సంగారెడ్డిలో పోటీ చేయనని మాత్రమే అన్నానని, వేరే నియోజకవర్గం నుంచి తప్పుకుంటానని చెప్పలేదని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సంగారెడ్డి స్థానం మహిళలకు కేటాయించినా లేదా జనరల్ స్థానంగా ఉన్నా అక్కడ నుంచి నిర్మలనే అభ్యర్థిగా బరిలో ఉంటారని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో ఎమ్మెల్యేలంతా అలెర్ట్ అవుతున్నారని, క్షేత్రస్థాయిలో యాక్టివ్‌గా లేని ప్రజాప్రతినిధులను సీఎం అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు.


గతంలో కేసీఆర్ మొదటిసారి సీఎం అయినప్పుడు కూడా ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని సర్వేలు వచ్చాయని జగ్గారెడ్డి గుర్తు చేశారు. రాజకీయాల్లో ఎవరూ పర్మినెంట్‌గా తోపులు కాదని, తామే గొప్ప అనుకుంటే నడవదని హితవు పలికారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే 117 సీట్లు గెలిపించుకునేలా ప్లాన్ సిద్ధం చేశారని అన్నారు. సీఎం హెచ్చరించిన తర్వాత కూడా తీరు మార్చుకోని ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో సీట్లు ఇవ్వాలో లేదో సీఎం, పీసీసీ చీఫ్, రాష్ట్ర ఇంచార్జ్‌లు మాత్రమే నిర్ణయిస్తారని ఆయన తేల్చి చెప్పారు. ఎవరి సర్వేలు వారికి అనుకూలంగా ఉంటాయని, వాటిని చూసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెబుతూ, ప్రతిపక్షాలు ఎప్పుడూ అధికార పక్షాన్ని టార్గెట్ చేయడం రాజకీయ నీతిలో భాగమేనని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.


ఈ వార్తలనూ చదవండి:

అంతరిక్షంలోకి వజ్రాన్ని పంపించనున్న భారతీయ కంపెనీ!

మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్

For More Viral News And Telugu News

Updated Date - Jul 11 , 2026 | 11:50 AM