ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు ఆధార్ ఒక్కటే చాలు: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Jul 25 , 2026 | 05:52 PM
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు ఆధార్ ఒక్కటే సరిపోతుందని, ఇతర పత్రాలు అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హతలు, దరఖాస్తు విధానంపై స్పష్టత ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల ప్రక్రియపై మంత్రి కీలక వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్, జులై 25: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు ఆధార్ ఒక్కటే సరిపోతుందని, ఇతర పత్రాలు అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హతలు, దరఖాస్తు విధానంపై స్పష్టత ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల ప్రక్రియపై మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కాల్ సెంటర్ సేవలు అందుబాటులో ఉంటాయని.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో సమాచారం పొందవచ్చని తెలిపారు. దరఖాస్తు సమయంలో ఆధార్ ఒక్కటి ఉంటే సరిపోతుందని, ఇతర పత్రాలు అవసరం లేదన్నారు. రూ.10 వేల ఈఎండీని యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాల్సి ఉంటుందని, ఇల్లు రాని వారికి అదే ఖాతాలో ఈఎండీ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని చెప్పారు.
క్యూఆర్ పరిధిలో 10 ఏళ్ల నివాసం, కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉండటం అర్హతలుగా పేర్కొన్నారు. ఒక కుటుంబానికి ఒక దరఖాస్తు, ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయిస్తామని తెలిపారు. సొంత ఇల్లు లేదా ప్లాట్ ఉన్నవారికి అర్హత ఉండదని, అర్హులు ఎక్కువైతే లాటరీ పద్ధతిలో కేటాయింపు చేస్తామని వెల్లడించారు. ఫ్లాట్ ధర రూ.40 నుంచి రూ.60 లక్షల వరకు ఉండగా, ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందిస్తుందని, లబ్ధిదారుడు రూ.6 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.
Also Read:
వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్‌లో కూడా శిక్షణ.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రియురాలితో మాట్లాడుతున్నాడని సహోద్యోగి హత్య..