Share News

ప్రియురాలితో మాట్లాడుతున్నాడని సహోద్యోగి హత్య..

ABN , Publish Date - Jul 25 , 2026 | 03:39 PM

ప్రియురాలితో చనువుగా మాట్లాడుతున్నాడన్న కోపంతో ఓ యువకుడు సహోద్యోగిపై దారుణానికి పాల్పడ్డాడు. అతి కిరాతకంగా పదునైన ఆయుధంతో సహోద్యోగిని పొడిచి చంపేశాడు.

ప్రియురాలితో మాట్లాడుతున్నాడని సహోద్యోగి హత్య..
Love triangle

ఇంటర్‌నెట్ డెస్క్: ప్రియురాలితో చనువుగా మాట్లాడుతున్నాడన్న కోపంతో ఓ యువకుడు సహోద్యోగిపై దారుణానికి పాల్పడ్డాడు. అతి కిరాతకంగా పదునైన ఆయుధంతో సహోద్యోగిని పొడిచి చంపేశాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బరేలీకి చెందిన సురేశ్ అనే వ్యక్తి గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అదే కంపెనీలో నరేశ్ అనే యువకుడు, బాబీ అనే యువతి కూడా పని చేస్తున్నారు. నరేశ్, బాబీ ఏడేళ్లనుంచి ప్రేమించుకుంటున్నారు.


గత కొద్దిరోజుల నుంచి బాబీ, సురేశ్ చనువుగా ఉంటున్నారు. ఈ విషయం నరేశ్‌కు తెలిసి ఆగ్రహానికి గురయ్యాడు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవద్దని బాబీ, సురేశ్‌లకు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో నరేశ్, సురేశ్‌ల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. గురువారం రాత్రి నరేశ్, సురేశ్ ఇద్దరూ కలిసి సిర్సా సర్కిల్ వద్ద బీర్లు తాగారు. ఈ నేపథ్యంలోనే బాబీ విషయంలో ఇద్దరికీ గొడవ మొదలైంది. ఆ గొడవ చిలికిచిలికి గాలివానలా మారింది. నరేశ్ తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో సురేశ్‌పై దాడి చేశాడు. సురేశ్ కూడా నరేశ్‌పై దాడి చేశారు.


ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. సురేశ్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు. నరేశ్‌కు చికిత్స అందించారు. చికిత్స అనంతరం నరేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

షమీని ఎవ్వరూ పట్టించుకోని స్థితికి తీసుకొచ్చారు: క్రిస్ శ్రీకాంత్

యువత భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం.. రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ భావోద్వేగం

Updated Date - Jul 25 , 2026 | 04:28 PM