వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం
ABN , Publish Date - Mar 10 , 2026 | 02:56 PM
మాజీ మంత్రి వై ఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాంపల్లిలోని సీబీఐ కోర్టులో ఈ కేసు విచారణ మంగళవారం జరిగింది.
హైదరాబాద్, మార్చి 10: నాంపల్లిలోని సీబీఐ కోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై మంగళవారం విచారణ జరిగింది. విచారణ నివేదిక, గతంలో దర్యాప్తు చేసిన సిట్ నివేదికలతోపాటు ఈ కేసు రికార్డులను నిందితులకు సీబీఐ అప్పగించింది. దాదాపు13 లక్షల ఫైల్స్‌ను ఇండెక్స్ రూపంలో సీబీఐ అందజేసింది. ఫైల్స్ తెరుచుకునే క్రమంలో ఎటువంటి సాంకేతిక సమస్య (టెక్నికల్ ఎర్రర్స్) తలెత్తకుండా చూస్తామని కోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. అలాగే కిరణ్ యాదవ్, అర్జున్‌రెడ్డి విచారణ నివేదికను సైతం కోర్టుకు సీబీఐ సమర్పించింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.
అసలు ఏం జరిగిందంటే..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదికను తమకు అందజేయాలని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో నిందితులు పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కంటే ముందు వివేకా హత్య కేసును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రిపోర్టు తమకివ్వాలని వారు కోర్టును కోరారు. అలాగే సీబీఐ అందించిన 13 లక్షల ఫైళ్లలో చాలా వరకు తెరుచుకోవడం లేదని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిందితుల తరఫు న్యాయవాదుల వాదనను సీబీఐ ఈ సందర్భంగా తోసిపుచ్చింది. కోర్టు అనుమతి ఇస్తే ఈ ఫైళ్లను తెరిచి చూపిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసును మంగళవారానికి అంటే.. ఈ రోజుకు కోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 59వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం
రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలు.. బండి సంజయ్ హెచ్చరిక
For More AP News And Telugu News