హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో యువతి మృతదేహం కలకలం..
ABN , Publish Date - May 22 , 2026 | 09:31 PM
హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో యువతి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లేక్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి యువతి మృతదేహం కనిపించింది.
హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో యువతి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లేక్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి యువతి మృతదేహం కనిపించింది. హుస్సేన్ సాగర్‌లో నీటిపై తేలియాడుతూ కనిపించడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండవచ్చని అంచనా చేస్తున్నారు. యువతి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదని లేక్ పోలీసులు చెప్పారు. మరోవైపు హైదరాబాద్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించామని తెలిపారు. మిస్సింగ్ కేసుల ఆధారంగా ఆమె వివరాలు గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. యువతి మృతిపై కేసు నమోదు చేశామని.. ఆమెది హత్యా, ఆత్మహత్యా లేక ప్రమాదవశాత్తూ మృతిచెందారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు లేక్ పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణ విద్య కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా..
యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి.. పర్యటన షెడ్యూల్ ఇదే..