యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి.. పర్యటన షెడ్యూల్ ఇదే..
ABN , Publish Date - May 22 , 2026 | 08:55 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నాడు యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వేద పాఠశాలకు భూమిపూజ చేయనున్నారు.
యాదాద్రి భువనగిరి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నాడు యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వేద పాఠశాలకు భూమిపూజ, లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ విడుదలైంది. శనివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరుతారు. అనంతరం 9:15 గంటలకు ప్రతిపాదిత వేద పాఠశాల స్థలానికి చేరుకుంటారు.
9:15 నుంచి 9:45 మధ్య వేద పాఠశాలకు భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొంటారు. సరిగ్గా ఉదయం 9:37 గంటలకు ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌డీ వేద పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 9:50కు వేద పాఠశాల స్థలం నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బయలుదేరుతారు రేవంత్ రెడ్డి. 10 గంటలకు దేవాలయానికి చేరుకుంటారు. 10 నుంచి 10:30 వరకూ స్వామివారిని దర్శించుకుంటారు. 10:30కు ప్రెసిడెన్షియల్ సూట్‌కు బయలుదేరి 10:40కి అక్కడికి చేరుకుంటారు.
ఉదయం 10:40 నుంచి 11 గంటల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటారు. 11 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11:10కి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అనంతరం 11:15కు యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.
ఈ వార్తలు కూడా చదవండి
నిమ్స్‌లో 2000 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్.. వైద్య బృందానికి సీఎం రేవంత్ అభినందనలు
తెలంగాణ విద్య కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా..