యాదాద్రికి నైనీ నుంచి రోజుకు 16 వేల టన్నుల బొగ్గు:జెన్‌కో సీఎండీ
ABN , Publish Date - Oct 06 , 2026 | 06:48 AM
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎ్‌స)కు ఒడిశాలోని నైనీ బ్లాకు నుంచి రోజుకు 16 వేల టన్నుల బొగ్గును తరలించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని జెన్‌కో సీఎండీ డాక్టర్ ఎస్.హరీశ్ తెలిపారు.
హైదరాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎ్‌స)కు ఒడిశాలోని నైనీ బ్లాకు నుంచి రోజుకు 16 వేల టన్నుల బొగ్గును తరలించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని జెన్‌కో సీఎండీ డాక్టర్ ఎస్.హరీశ్ తెలిపారు. ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకును సోమవారం సింగరేణి అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
నైనీ బ్లాకు నుంచి బొగ్గు తరలింపులో ఉన్న సమస్యలను, స్థానిక రవాణా అడ్డంకులను తొలగించడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎల్‌నినోతో రాష్ట్రంలో అనూహ్యంగా పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను తీర్చడంలో యాదాద్రిలోని అలా్ట్ర సూపర్ క్రిటికల్ పవర్ స్టేషన్ కీలకంగా మారిందని, దానిలో 4 వేల మెగావాట్ల పూర్తిసామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
ఆకాశంలో బియ్యం, నిత్యావసరాల ధరలు
రామప్పను కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం
వృత్తి నిపుణులను కాంగ్రెస్ వైపు మళ్లించండి
Read Latest Telangana News And Telugu News