రిటైర్డ్ ఐపీఎస్ నాగేశ్వరరావుకు ‘ఎక్స్’ నోటీసులు
ABN , Publish Date - Nov 19 , 2026 | 06:53 AM
హైదరాబాద్ మాజీ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ‘యూనిఫాంలో ఉన్న క్రిమినల్’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలతో ‘ఎక్స్’లో పోస్టు పెట్టిన రిటైర్డ్ ఐపీఎస్ ఎం.నాగేశ్వరరావుకు ఆ సంస్థ నోటీసులు జారీ చేసింది.
వీసీ సజ్జనార్‌పై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారం
నోటీసులను సీపీ మహేశ్‌కు ట్యాగ్ చేసిన నాగేశ్వరరావు
హైదరాబాద్ సిటీ, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మాజీ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ‘యూనిఫాంలో ఉన్న క్రిమినల్’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలతో ‘ఎక్స్’లో పోస్టు పెట్టిన రిటైర్డ్ ఐపీఎస్ ఎం.నాగేశ్వరరావుకు ఆ సంస్థ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ‘ఎక్స్’ను కోరడంతో ఆ సంస్థ నాగేశ్వరరావు పోస్టును తొలగించింది.
అనంతరం ఈమెయిల్ ద్వారా ఆయనకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందగానే ఆయన వాటిని ప్రస్తుత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం భగవత్‌కు ట్యాగ్ చేశారు. తాను పెట్టిన పోస్టు ఏ సెక్షన్ ప్రకారం చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందో స్పష్టత ఇవ్వాలని సీపీని కోరారు. చట్టబద్ధమైన పోలీసింగ్‌లో మహేశ్ భగవత్ విజయవంతం కావాలని మరో పోస్టు పెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం
Read Latest Telangana News And Telugu News