Share News

ఫోన్‌ చోరీ చేశాడని దాడి.. వ్యక్తి మృతి

ABN , Publish Date - Oct 01 , 2026 | 06:18 AM

సెల్‌ఫోన్‌ను చోరీ చేశాడనే అనుమానంతో ఓ యువకుడు, అతని కుటుంబసభ్యులు ఓ వ్యక్తిపై దాడి చేయగా.. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

ఫోన్‌ చోరీ చేశాడని దాడి.. వ్యక్తి మృతి
Medak incident

వెల్దుర్తి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సెల్‌ఫోన్‌ను చోరీ చేశాడనే అనుమానంతో ఓ యువకుడు, అతని కుటుంబసభ్యులు ఓ వ్యక్తిపై దాడి చేయగా.. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలంలోని మన్నెవారి జలాల్‌పూర్‌ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండెని ప్రవీణ్‌ తన సెల్‌ఫోన్‌ను వినాయక నిమజ్జనం రోజున పోగొట్టుకున్నాడు.


దానిని గ్రామానికి చెందిన బ్యాగరి రామానుజం (40) చోరీ చేశాడని అనుమానించి.. ప్రవీణ్‌, అతడి కుటుంబ సభ్యులు, మరి కొంతమంది అతడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ రామానుజం సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. గ్రామంలో ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రామానుజానికి భార్య రజిత, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తూప్రాన్‌ సీఐ వెంకటరాజాగౌడ్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:
నిమ్స్‌ డాక్టర్‌ లక్ష్మీభాస్కర్‌పై సస్పెన్షన్‌ వేటు

సీఎంను కలిసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 06:18 AM