Share News

సోనియా లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు:ఉత్తమ్‌

ABN , Publish Date - Nov 19 , 2026 | 06:56 AM

సోనియాగాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన లేదని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు.

సోనియా లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు:ఉత్తమ్‌

సోనియాగాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన లేదని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదని, ఆమె వల్లే మీ కుటుంబానికి మేలు జరిగిందని, పదవులు వచ్చాయని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


ఆ విషయాన్ని మరిచిపోయి సోనియాగాంధీపై విమర్శలు చేస్తావా... ఆత్మకథలో లేకుంటే ఏంటీ... సోనియా హృదయంలో తెలంగాణ ఉందని మంత్రి పేర్కొన్నారు. ఆమె సంకల్పం వల్లే రాష్ట్రం వచ్చిందనే విషయాన్ని గుర్తించాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 06:56 AM