హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో డెన్వర్ క్యాంపస్
ABN , Publish Date - Oct 08 , 2026 | 06:54 AM
హైదరాబాద్‌లో తొలి విదేశీ విశ్వవిద్యాలయం కొలువుదీరనుంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ‘యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో డెన్వర్’ (సీయూ డెన్వర్) క్యాంప్‌సను ఏర్పాటు చేయనుంది.
యూజీసీ నుంచి ప్రాథమిక అనుమతి
2027 ఆగస్టులో తొలి బ్యాచ్ ప్రారంభం
హైదరాబాద్ సిటీ, హైదరాబాద్, అక్టోబర్ 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో తొలి విదేశీ విశ్వవిద్యాలయం కొలువుదీరనుంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ‘యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో డెన్వర్’ (సీయూ డెన్వర్) క్యాంప్‌సను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రాథమిక అనుమతి (లెటర్ ఆఫ్ ఇంటెంట్) జారీ చేసింది. దీంతో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించనున్న తొలి అమెరికా వర్సిటీగా సీయూ డెన్వర్ నిలవనుంది. తొలుత బిజినెస్, కంప్యూటింగ్, ఇంజనీరింగ్, ఎనలటిక్స్ వంటి అధిక డిమాండ్ ఉన్న కోర్సులను అందించనుంది.
అనంతర కాలంలో యూజీసీ అనుమతుల మేరకు ఇతర కోర్సులను కూడా పరిచయం చేయనున్నారు. 2027 ఆగస్టులో తొలి బ్యాచ్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీయూ డెన్వర్ ఛాన్స్‌లర్ కెన్నెత్ టీ క్రిస్టెన్సన్ తెలిపారు. భారత విద్యార్ధులతో తమ యూనివర్శిటీకి దశాబ్దాల అనుబంధం ఉందంటూ.. అదే అనుబంధాన్ని హైదరాబాద్ క్యాంపస్ ద్వారా మరింతగా విస్తరించనున్నట్టు ప్రకటించారు. ఈ క్యాంపస్ ఏర్పాటులో గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ ఎమిరటస్ వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరించనుందని తెలిపారు. హైదరాబాద్ క్యాంపస్ ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన, ఉద్యోగ అవకాశాలకు అనుగుణమైన కోర్సులను అందించనున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
మ్యూల్ ఖాతాలిచ్చే వారిలో చదువుకున్నోళ్లే ఎక్కువ
అబద్ధాలను పోగేసి బీఆర్‌ఎస్ దుష్ప్రచారం
ట్రైబ్యునల్ తేల్చితేనే పాలమూరు-రంగారెడ్డి!
Read Latest AP News And Telugu News