Share News

గెలుపు ధ్రువపత్రం జారీలో జాప్యమెందుకు..?

ABN , Publish Date - Oct 18 , 2026 | 06:33 AM

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల గెలుపు ధృవపత్రం జారీలో ఎందుకు జాప్యం జరుగుతుందని ఆర్టీసీ జేఏసీ ప్రశ్నించింది.

గెలుపు ధ్రువపత్రం జారీలో జాప్యమెందుకు..?
RTC election

  • కార్మికశాఖ తీరుపై ఆర్టీసీ జేఏసీ ఖండన

హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల గెలుపు ధృవపత్రం జారీలో ఎందుకు జాప్యం జరుగుతుందని ఆర్టీసీ జేఏసీ ప్రశ్నించింది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మిక శాఖ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని శనివారం ఓప్రకటనలో పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఎంప్లాయిస్‌ యూనియన్‌, టీఎంయూ, ఎన్‌ఎంయూలతో కూడిన జేఏసీ కూటమి ఘన విజయం సాధించిందని, అయి నా, గెలుపు ధృవీకరణ పత్రం జారీలో కార్మికశాఖ తీవ్ర జాప్యం చేస్తుందని మండి పడింది.


ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కార్మికశాఖ తమకు అడ్డంకులు సృష్టిస్తూనే ఉందని జేఏసీ ఆరోపించింది. గెలుపు ధృవీకరణ పత్రాన్ని తక్షణమే జారీ చేయాలని జేఏసీ డిమాం డ్‌ చేసింది. ఈ విషయంలో కార్మిక మంత్రి వివేక్‌ వెంకటస్వామి జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆర్టీసీ జేఏసీ కోరింది.


ఈ వార్తలు కూడా చదవండి

మూడోవంతు విద్యుత్‌ జెన్‌కో నుంచే...

అవసరమైతే కోమటిరెడ్డి కోసం తల నరుక్కుంటా..

క్యూనెట్‌ కేసు కీలక నిందితుడు డిగ్‌ విజయ్‌సింగ్‌ అరెస్టు

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 18 , 2026 | 06:33 AM