10వ తరగతి వరకే కొనసాగిస్తాం: ట్రస్మా
ABN , Publish Date - Nov 19 , 2026 | 07:07 AM
పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్‌ను విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల సంఘం (ట్రస్మా) తెలిపింది.
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్‌ను విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల సంఘం (ట్రస్మా) తెలిపింది. అయితే, ఆర్థికంగా వెనుకబడిన బడ్జెట్ పాఠశాలలకు ఈ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది.
ట్రస్మా అధ్యక్షుడు ఎస్‌ఎన్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం పాఠశాల విద్య సంచాలకులు నవీన్ నికోల్‌సను కలిసి వినతిపత్రం అందజేసింది. ప్రస్తుతం ఉన్న విధానంలోనే పదో తరగతి వరకు పాఠశాలలు నిర్వహించుకునేందుకు అనుమతించాలని ఈ సందర్భంగా కోరింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
బాబా బర్త్‌డే స్పెషల్.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు
Read Latest Telangana News And Telugu News