Share News

బీసీలకు బీఆర్‌ఎస్‌, బీజేపీలే అతిపెద్ద ద్రోహులు

ABN , Publish Date - Oct 07 , 2026 | 06:42 AM

బీసీల సంక్షేమాన్ని విస్మరించి బీఆర్‌ఎస్‌, బీజేపీలు తీవ్రమైన మోసాలకు పాల్పడ్డాయని టీపీసీసీ ఓబీసీ సెల్‌ మండిపడింది. ఈ రెండు పార్టీలు పూర్తిగా బీసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఆరోపిస్తూ ఓబీసీ సెల్‌ చైర్మన్‌ కేతూరి వెంకటేశ్‌ ఒక చార్జిషీటు విడుదల చేశారు.

బీసీలకు బీఆర్‌ఎస్‌, బీజేపీలే అతిపెద్ద ద్రోహులు
Keturi Venkatesh

  • చార్జిషీట్‌ విడుదల చేసిన టీపీసీసీ ఓబీసీ సెల్‌

బీసీల సంక్షేమాన్ని విస్మరించి బీఆర్‌ఎస్‌, బీజేపీలు తీవ్రమైన మోసాలకు పాల్పడ్డాయని టీపీసీసీ ఓబీసీ సెల్‌ మండిపడింది. ఈ రెండు పార్టీలు పూర్తిగా బీసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఆరోపిస్తూ ఓబీసీ సెల్‌ చైర్మన్‌ కేతూరి వెంకటేశ్‌ ఒక చార్జిషీటు విడుదల చేశారు.

బీఆర్‌ఎస్‌ పార్టీకి పాతికేళ్లుగా వెలమ సామాజిక వర్గం వారే అధ్యక్షులుగా ఉన్నారని, రాష్ట్రంలో 52 శాతంగా ఉన్న బీసీలకు ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదని ఈ సందర్భంగా వెంకటేశ్‌ పేర్కొన్నారు. ఇక జాతీయ స్థాయిలో కుల గణనకు కేంద్రంలోని బీజేపీ పదేళ్లుగా నిరాకరిస్తోందని, బీసీలకు 27 శాతం రిజర్వేషన్‌ అమల్లో జాప్యం చేస్తోందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...
ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపడం తగదు!

‘కరెంట్‌ కొంటాం.. అనుమతించండి’

15 రోజుల్లో డిపెండెంట్‌ ఆర్డర్లు!

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 06:43 AM