Share News

ప్రభుత్వాలు కాదు కాంగ్రెస్ పార్టీయే శాశ్వతం: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ABN , Publish Date - Apr 03 , 2026 | 08:22 PM

అట్టడుగు వర్గాలకు న్యాయం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ పుట్టిందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్‌లో 70 శాతం జిల్లా అధ్యక్షుల పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే పొందాలని చెప్పుకొచ్చారు.

ప్రభుత్వాలు కాదు కాంగ్రెస్ పార్టీయే శాశ్వతం: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
TPCC Chief Mahesh Goud

కొమురం భీమ్: అట్టడుగు వర్గాలకు న్యాయం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ పుట్టిందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్‌లో 70 శాతం జిల్లా అధ్యక్షుల పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే పొందాలని చెప్పుకొచ్చారు. పార్టీ కార్యకర్తలు కష్టపడితేనే అధికారంలోకి వస్తామని.. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, కాంగ్రెస్ పార్టీయే శాశ్వతమని ఆయన పేర్కొన్నారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశంలో మహేశ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ మేరకు కార్యకర్తలు, నేతలను ఉద్దేశిస్తూ కీలక ప్రసంగం చేశారు.


కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తలు జైళ్లకు పోయారని, దెబ్బలు తిన్నారని, అన్ని కష్టాలు ఎదుర్కొన్నారని మహేశ్ గౌడ్ చెప్పుకొచ్చారు. కార్యకర్తల కష్టం ఫలితంగానే నేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇష్టమెుచ్చినట్లు చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టాల్సి వస్తోందని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేలు సైతం తమ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.


కాంగ్రెస్ పార్టీ విద్య, వైద్య రంగాన్ని ముందుకు తీసుకెళ్తోందని టీపీసీసీ చీఫ్ చెప్పుకొచ్చారు. భవిష్యత్తు మనదే అని.. ఇంకో 20 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాలను ఆదుకోవడమే కాంగ్రెస్ లక్ష్యమని ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

కేరళంలో రేవంత్ రెడ్డిది అంతా అసత్య ప్రచారమే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా బుక్కైన నైజీరియా మహిళ

Updated Date - Apr 03 , 2026 | 08:29 PM