టీజీఎస్‌ఆర్టీసీలో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్
ABN , Publish Date - Oct 09 , 2026 | 09:34 AM
తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ రోజు (శుక్రవారం) ఉదయం 5.00 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం 6.00 గంటలతో ఈ పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.
హైదరాబాద్, అక్టోబర్ 09: తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ రోజు (శుక్రవారం) ఉదయం 5.00 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం 6.00 గంటలతో ఈ పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. బ్యాలెట్ పేపర్ విధానంలో నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ ఎన్నికల్లో తమదే విజయమంటూ ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ కూటమి స్పష్టం చేస్తోంది. మరో వైపు టీడబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ ఎన్నికల్లో 36,300 మంది ఆర్టీసీ కార్మికులు.. తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే దూర ప్రాంతాల్లో డ్యూటీలో ఉన్న కార్మికుల కోసం అక్టోబర్ 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ చేపట్టనున్నారు. ఈ నెల 17వ తేదీన ఈ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బందరు ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి చేయకుంటే కాంట్రాక్ట్ రద్దు చేస్తా: కొల్లు రవీంద్ర
సాయికృష్ణ డెత్ కేసు ఛార్జిషీట్‌లో కీలక ఆధారాలు కోర్టు సమర్పించిన సిట్