Share News

డీఏవీ పదో తరగతి టాపర్లకు టీజీజెన్‌కో సత్కారం

ABN , Publish Date - Nov 19 , 2026 | 06:24 AM

తెలంగాణ పవర్‌ జెనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(టీజీజెన్‌కో) ఆధ్వర్యంలో నడుస్తున్న డీఏవీ ఉన్నత పాఠశాలల పదో తరగతి టాపర్లను సంస్థ ఘనంగా సత్కరించింది.

డీఏవీ పదో తరగతి టాపర్లకు టీజీజెన్‌కో సత్కారం

  • విద్యార్థులకు బంగారు, వెండి, కాంస్య పతకాల ప్రదానం

  • విద్య, ఆరోగ్య రంగాలకు పెద్దపీట: డైరెక్టర్‌ కుమార్‌రాజు

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పవర్‌ జెనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(టీజీజెన్‌కో) ఆధ్వర్యంలో నడుస్తున్న డీఏవీ ఉన్నత పాఠశాలల పదో తరగతి టాపర్లను సంస్థ ఘనంగా సత్కరించింది. 2025- 26 విద్యాసంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం బుధవారం హైదరాబాద్‌ సఫిల్‌గూడలోని డీఏవీ ఉన్నతపాఠశాలలో అభినందనసభ నిర్వహించారు.


కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీజీజెన్‌కో డైరెక్టర్‌ ఎస్‌. వి. కుమార్‌రాజు విద్యార్థులకు బంగారు, వెండి, కాంస్య పతకాలతో పాటు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీజీజెన్‌కో ఎల్లప్పుడూ విద్య, ఆరోగ్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విజయాలు సాధించడంలో కృషి చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 06:24 AM