గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్‌గా తెలంగాణ: మంత్రి శ్రీధర్‌బాబు
ABN , Publish Date - Jun 12 , 2026 | 04:43 PM
తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. లాజిస్టిక్స్ పాలసీ 2.0 ద్వారా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం నాడు హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఎఫ్‌టీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ 2026’ సదస్సుకు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లాజిస్టిక్స్ రంగంలో భవిష్యత్ అవకాశాలపై సదస్సు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌లో కీలక రంగంగా లాజిస్టిక్స్‌ను ప్రభుత్వం గుర్తించిందన్నారు. లాజిస్టిక్స్ పాలసీ 2.0 ద్వారా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా మెగా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, డ్రై పోర్టుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. బాండెడ్ వేర్ హౌజింగ్ లాజిస్టిక్ పార్కుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఏఐ సైబర్ సెక్యూరిటీ మెషీన్ లెర్నింగ్ వినియోగానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. లాజిస్టిక్స్ రంగానికి అవసరమైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను తయారు చేయడంపైనా ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
‘ఉత్తమ వైద్యం అందిస్తాం’.. చిన్నారి ఆర్యాంశ్‌కు సీఎం రేవంత్ అండ
సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. త్వరలో యథావిధిగా మెడికల్ బోర్డు
Read Latest Telangana News And Telugu News