అమెరికా క్షిపణి దాడిలో విశాఖ వాసి మృతిపై సీఎం చంద్రబాబు విచారం
ABN , Publish Date - Jun 12 , 2026 | 04:01 PM
అమెరికా క్షిపణి దాడిలో విశాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేశ్ మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. సురేశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి, జూన్ 12: అమెరికా క్షిపణి దాడిలో విశాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేశ్ మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. సురేశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సురేశ్ మృతదేహాన్ని స్వదేశానికి తెచ్చేందుకు భారత రాయబార కార్యాలయం, ఒమన్ అధికారులతో సంప్రదింపులు జరపాలని సూచించారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని సీఎం ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏపీ భవన్ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టింది.
ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి జరుగగా సురేశ్ మృతి చెందినట్టు గుర్తించారు. సురేశ్ ప్రయాణిస్తున్న నౌక ప్రస్తుతం ఒమన్ తీరానికి 30 నాటికల్ మైళ్ల దూరంలో నిలిచిపోయినట్టు సమాచారం. నౌకను ఒడ్డుకు తీసుకురావడానికి ఒమన్ అధికారులు చర్యలు చేపట్టారు. నౌక ఈ అర్ధరాత్రికి పోర్టుకు చేరుకునే అవకాశం ఉంది. అధికారిక గుర్తింపు అనంతరం భారతదేశానికి తరలించనున్నారు.
ఇవి కూడా చదవండి..
రాయలసీమలో రత్నాలు పండేలా చేసిన వ్యక్తి సీబీఎన్: మంత్రి లోకేశ్
ఏపీలో చీకటి పాలన పోయి.. ప్రజాపాలన వచ్చింది: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News